సినిమా

ఇరుముడి’ సినిమాపై వివాదం..

Reporter
Shiva Kumar Prakasam Reporter
2 months ago
◉ 20 Views
News Image

గాయత్రి న్యూస్ ,మచిలీపట్నం: రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమాపై వివాదం నెలకొంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడి పాత్రను ప్రతికూలంగా చూపించడంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ద్వారా ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగేలా చిత్రీకరణ చేయడం సరికాదని పేర్కొన్నారు. అలాగే అయ్యప్ప స్వాములు, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను కూడా తొలగించాలని కోరారు. వివాదాస్పద సన్నివేశాలపై చిత్ర బృందం వెంటనే స్పందించి, వాటిని తొలగించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

చిరంజీవికి సీఎం శుభాకాంక్షలు