శ్లోక స్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
Prabhakar
Ealuru Incharge
◉
30 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా,కుక్కునూరులోని శ్లోక స్కూల్లో శనివారం టీచర్స్ డే వేడుకల సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు పాఠాలు బోధిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉపాధ్యాయులకు నిర్వహించిన ఆటల,పాటల పోటీల్లో విజయం సాధించిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు.పాఠశాల ఉపాధ్యాయులందరినీ స్కూల్ కరస్పాండెంట్స్ మాదినేని శ్రీనివాస్, సుజాత, పిచ్చుక మనోజ్ కుమార్, రమ్య ఘనంగా సన్మానించడంతోపాటు శుభాకాంక్షలు తెలిపారు.