మాజీ ఎమ్మెల్యేకు టిడిపి మండల అధ్యక్షుల సవాల్
Prabhakar
Ealuru Incharge
◉
13 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అర్వాయిపల్లి భూసేకరణ నోటిఫికేషన్ పై విడుదల చేసిన వీడియోపై టిడిపి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల అధ్యక్షులు నాగు, అమరవరపు అశోక్ స్పందించారు.ఎవరో చెపితే విని మాజీఎమ్మెల్యే అన్ని అవాస్తవాలే మాట్లాడారని,భూ సేకరణ అవినీతిపై విచారణకు మేము సిద్ధం,మీరు సిద్దమాఅని మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. గిరిజన,గిరిజనేతర రైతుల సమక్షంలో సర్వే చేసిన అధికారులు నోటిఫికేషన్ ఇస్తే,అవినీతి జరిగిందనడం మాజీఎమ్మెల్యే అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.