లబ్ధిదారుల ఇంటికి సీఎం సహాయనిధి చెక్కులు
Prabhakar
Ealuru Incharge
◉
8 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కొయ్యలగూడెంమండలం రామానుజపురం,సరిపల్లి,కన్నాపురం గ్రామాల లబ్ధిదారుల ఇంటికి నేరుగావెళ్లి సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు.ఆర్థికపరిస్థితుల కారణంగా వైద్యచికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితకుటుంబాలకు ప్రభుత్వం తరపున సహాయాన్ని అందచేస్తున్నామని తెలిపారు.లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.