కుక్కునూరులో B,C బ్లాకులు జలమయం
Prabhakar
Ealuru Incharge
◉
15 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కుక్కునూరులో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.లోతట్టు ప్రాంతాలైన B బ్లాక్ లో వీధులన్నీ బురదమయం కాగా,C బ్లాక్ లోని రోడ్లపై వరదనీరు షాపులు,ఇళ్లలోకి వచ్చిచేరింది.మోకాళ్లలోతు నీటిలో వాహనదారులు వృద్ధులు,పిల్లలు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు.జెసిబి దొరకలేదనే కారణంతో గ్రామపంచాయతీ సిబ్బంది డ్రైనేజీ లో పూడిక తీయని కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు