ఉద్యోగాలు

భైంసా మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ జాదవ్ సంతోష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు పటుబడ్డారు.

Reporter
Menchu Bhojanna Adilabad Incharge
6 days ago
◉ 12 Views
News Image

గాయత్రి న్యూస్ ,భైంసా: భైంసా మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ జాదవ్ సంతోష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు పటుబడ్డారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల్ చౌరస్తా ప్రాంతంలోని కుబేర హోటల్ సమీపంలో ఘటన జరిగింది. భైంసా మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ తో పాటు ఇంచార్జీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఒక కాంట్రక్టర్ కు బిల్లు చెల్లించే విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. సంబంధిత విషయంలో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారుల సూచన మేరకు సదరు కాంట్రాక్టర్ నిర్మల్ లోని కుబేర్ హోటల్ సమీపంలో రూ.50 వేలను ఇంచార్జీ కమిషనర్ జాదవ్ సంతోష్ కు లంచంగా ఇచ్చాడు. ఇదే సమయంలో అక్కడే కాపు కాచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా ఆయనను పట్టుకున్నట్లుగా తెలిసింది, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  పల్సి విలేజ్ లో చింతపులి పంచలు
అక్కడమిక్ ఇన్ స్ట్రక్టర్ల కోసం  దరఖాస్తుల ఆహ్వానం