శ్రీకాళహస్తి అమ్మాయికి స్వర్ణ పథకం
M Munirathnam
Srikalahasthi Reporter
◉
21 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీవీధికి చెందిన నిత్య, వంశీ కాలేజీ చదువుకుంటూ ఏపీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. తిరుపతిలో జరిగిన అండర్–18 బాలికల విభాగంలో డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం, షాట్‌పుట్‌లో రజత పతకం సాధించింది. రెండు విభాగాల్లో పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిలిచింది. ఈ ప్రతిభతో సెప్టెంబర్‌లో పుదుచ్చేరిలో జరిగే జూనియర్ సౌత్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. నిత్య విజయంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. సహకారం అందిస్తున్న తిరుపతి జిల్లా శాప్ అధ్యక్షుడు కిషోర్‌కు నిత్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.