లోకేష్ విజయనగరం పర్యటన
Shiva Kumar
Prakasam Reporter
◉
12 Views
గాయత్రి న్యూస్ ,విజయనగరం: విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 22న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం విశాఖపట్నం జిల్లా మధురవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చంద్రంపాలెంలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం విజయనగరం చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు జరిగే హెచ్‌ఆర్‌డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు విజయనగరం మండలం చెల్లవూరు గ్రామంలో పార్టీ క్యాడర్‌తో సమావేశమవుతారు.