జడ్పీ పాఠశాలకు హంగులు
Shiva Kumar
Prakasam Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,విజయనగరం: ప్రతినిధి: రామడుగు శివకుమార్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, హెచ్‌ఆర్‌డీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. దివీస్ ల్యాబ్స్ సహకారంతో రూ.6.48 కోట్లతో అభివృద్ధి చేసిన పాఠశాలలో ఆధునీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, మౌలిక వసతులను పరిశీలించారు. ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి లోకేష్ సరదాగా వాలీబాల్ ఆడారు.