పాల్గుల గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Puthala Naveen
Mandal Reporter
◉
14 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: మహదేవపూర్ మండలం పాల్గుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉపసర్పంచ్,చంద్రయ్య , పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, రేషన్ డీలర్ బీరం బాబు, సిబ్బంది పాల్గొన్నారు.స్మార్ట్ కార్డులతో పేద కుటుంబాలకు రేషన్ సౌకర్యాలు సులభంగా అందుతాయని సర్పంచ్ తెలిపారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.