చిట్టత్తూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై గ్రామసభ
M Munirathnam
Srikalahasthi Reporter
◉
16 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం చిట్టతూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహించారు. గ్రామ సచివాలయ అధికారిణి కె. శాంతి ఆధ్వర్యంలో జరిగిన సభకు డిప్యూటీ ఎంపీడీఓ జి. భార్గవ్ సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను అధికారులు గ్రామసభలో చదివి వినిపించి ప్రజల ఆమోదం పొందారు. అభ్యంతరాలపై క్షేత్రస్థాయి విచారణ బుధవారంతో ముగుస్తుందని, సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహించి, సెప్టెంబర్ 7న తుది జాబితా ప్రచురిస్తామని భార్గవ్ సత్యం తెలిపారు.