బలవంతపు వసూళ్లు చేయరాదు- శ్రీకాళహస్తి పోలీసుల వార్నింగ్
M Munirathnam
Srikalahasthi Reporter
◉
12 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వన్ టౌన్ మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్ల సీఐల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మండపాల ఏర్పాటుకు మీ పరిధి స్టేషన్ నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని, రాత్రివేళ మండపాల వద్ద నిర్వాహకులు ఉండాలని తెలిపారు. భక్తులు, మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, నిమజ్జనం ఊరేగింపులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదన్నారు. డీజేలకు అనుమతి లేదని, రోడ్డుపై వాహనాలను ఆపి బలవంతంగా చందాలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు.