ఎంపీటీసీ ఎన్నికలకు అధికారుల సన్నద్ధత- చిట్టత్తూరు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: రాష్ట్రంలో ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ క్రమంలో తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో సురేంద్రనాథ్, చిట్టతూరు గ్రామ అభివృద్ధి అధికారి శాంతితో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, అవసరమైన ఇతర సదుపాయాలను సమకూర్చి ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఎంపీడీవో ఆదేశించారు.