స్థానిక వార్తలు

వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
2 months ago
◉ 16 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా SRN వినాయక ట్రస్ట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ దేవస్థానం బోర్డు మెంబర్ బుల్లెట్ జై శ్యామ్ రాయల్, నాగమల్లి చైతన్య, పృద్వి, వినయ్, కార్తిక్ యాదవ్, మహమ్మద్, రాజా, బాలాజీ, ఆనంద్, గిరి తదితరులు పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం