స్థానిక వార్తలు

విద్యార్థులు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి: సోము వీర్రాజు

Reporter
Shiva Kumar Prakasam Reporter
1 month ago
◉ 27 Views
News Image

గాయత్రి న్యూస్ ,కాకినాడ: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) కాకినాడ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మాహ్ సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించిన రెండ్రోజుల పోషకాహార ప్రదర్శన బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని, సుపోషిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పోషకాహార స్టాళ్లను పరిశీలించి ఐసీడీఎస్, అంగన్‌వాడీ సిబ్బంది సేవలను అభినందించారు. క్విజ్, వక్తృత్వం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా CBC అధికారులు సోము వీర్రాజు గారిని శాలువా పుష్ప గుచ్ఛంతో సత్కరించారు

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం