సేవా కార్యక్రమంతో లయన్స్ క్లబ్ అండ
Shiva Kumar
Prakasam Reporter
◉
25 Views
గాయత్రి న్యూస్ ,మార్కాపురం: మార్కాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ ప్రాంతాల్లో తమ స్వయం ఉపాధిని కొనసాగిస్తున్న వారికి అండగా నిలిచే కార్యక్రమం నిర్వహించారు. ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు రూ.23 వేల విలువైన 20 గొడుగులను 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. సమాజంలో తమ వృత్తుల ద్వారా జీవనోపాధిని కొనసాగిస్తున్న వారికి అవసరమైన సహకారం అందించడమే కార్యక్రమం ఉద్దేశమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎల్.ఎన్. కాసెట్టి జగన్ బాబు, జోన్-2 చైర్మన్ టి.వై. రామకృష్ణారావు, కార్యదర్శి బి.వై. రంగయ్య, కోశాధికారి ఏ.వి. నారాయణరెడ్డి, సభ్యులు కోలా ప్రభాకర్‌రావు, ఎం.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.