పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 95వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం
M Munirathnam
Srikalahasthi Reporter
◉
17 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి చరిత్రలో వరుసగా 95 వారాలుగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేట బ్రదర్స్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన పేట బ్రదర్స్, ఎలాంటి విరామం లేకుండా ప్రతి వారం అన్నదానం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో 95వ వారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు అన్నదానం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషిగా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పేట బ్రదర్స్, జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.