కాకినాడలో ఐఎన్‌సీఓఐఎస్ ప్రాంతీయ కార్యాలయం.. రూ.100 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదన
Shiva Kumar
Prakasam Reporter
◉
19 Views
గాయత్రి న్యూస్ ,కాకినాడ: కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర పరిశోధన, అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఎన్‌సీఓఐఎస్), ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంగళవారం కాకినాడలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా సుమారు రూ.100 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా కాకినాడలో ఐఎన్‌సీఓఐఎస్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 20, పరోక్షంగా 30 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. మెరైన్, మారిటైమ్ పరిశోధన, సాంకేతికత, సేవలను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో సముద్ర పరిశోధన రంగ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు ఈ ఒప్పందం దోహదపడనుంది.