మహా యాగం ప్రారంభం
గాయత్రి న్యూస్ ,హైదరాబాద్: దేశ రక్షణ, ధర్మ పరిరక్షణ సంకల్పంతో హిందూ ధర్మ చక్రం సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే యాగం శుక్రవారం మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు బ్రహ్మశ్రీ చెబియం రాఘవ శర్మ, నరేష్ శర్మ నేతృత్వంలో యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాగకర్తలుగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి, భీమ్ సేన్ మూర్తి వ్యవహరిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు యాగంలో పాల్గొని యాగ బ్రహ్మ ఆశీస్సులు పొందారు. రాష్ట్రపతి బిరుదు గ్రహీత బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ శాస్త్రి ధర్మ ప్రాముఖ్యతపై ప్రవచనం చేశారు. ఉదయం గణపతి పూజ, సంకల్పం, ప్రోక్షణ అనంతరం సుదర్శన హోమం, నృసింహ హోమం, వైదిక క్రతువులు నిర్వహించి హారతితోతొలిరోజు కార్యక్రమాలను ముగించారు