కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తాం: నిర్మల్ కలెక్టర్
Menchu Bhojanna
Adilabad Incharge
◉
17 Views
గాయత్రి న్యూస్ ,నిర్మల్: కొత్త చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమం చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అందిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ దరఖాస్తులను గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాల ప్రజలు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.