స్థానిక వార్తలు

మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం: అన్నా రాంబాబు

Reporter
Shiva Kumar Prakasam Reporter
23 days ago
◉ 21 Views
News Image

గాయత్రి న్యూస్ ,మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని 10, 11, 12, 13, 14వ బ్లాకుల్లో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కనకదుర్గను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు. మార్కాపురం పట్టణంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అన్నా రాంబాబు తెలిపారు. మున్సిపాలిటీగా అభివృద్ధి చెందడంతోపాటు జిల్లా కేంద్రంగా విస్తరిస్తున్న మార్కాపురానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. కనకదుర్గను గెలిపిస్తే మార్కాపురం అభివృద్ధి ఎలా ఉండాలో చేసి చూపిస్తామని ఆయన అన్నారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం