గోదావరి పుష్కరాలకు 210 కోట్లు
Shiva Kumar
Prakasam Reporter
◉
13 Views
గాయత్రి న్యూస్ ,రాజమహేంద్రవరం: ఏపీ: 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిధులతో 238 పాత, కొత్త పుష్కరఘాట్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కరఘాట్లను ఆధునీకరించి, నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.