చండీ హోమం, అన్న ప్రసాదo
Shiva Kumar
Prakasam Reporter
◉
13 Views
గాయత్రి న్యూస్ ,వరంగల్ మహానగరం: శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో చండీ హోమం, అన్న ప్రసాద వితరణ అమావాస్యను పురస్కరించుకొని 12.08.2026 బుధవారం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గోసికొండ శకుంతల సుధాకర్, ధర్మకర్తలు నీలం అరుణ శ్రీనివాస్, పల్లకొండ రాజమణి రమేష్, పిట్టల కోటేశ్వర్, మెడకుర్తి లోకేష్ రేణుక దంపతుల సమక్షంలో, ప్రధాన అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ ప్రారంభమైంది. సుమారు 150 మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణ దాతగా ఆలయ కమిటీ చైర్మన్ గోసికొండ శకుంతల సుధాకర్ పాల్గొన్నారు.