మద్దులపల్లి గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..
Puthala Naveen
Mandal Reporter
◉
9 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామ ప్రజలకు, ముఖ్యంగా 6వ వార్డు నివాసితులకు వార్డు సభ్యులు పూతల వెంకటేష్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీకట్లను పారద్రోలుతూ వెలుగులు నింపే దీపావళి పండుగను గ్రామ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలను, లక్ష్మీ కటాక్షాన్ని నింపాలని కోరుకున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా పండుగను జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.