మెగా ఉచిత వైద్య శిబిరం
Shiva Kumar
Prakasam Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,మార్కాపురం: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా లయన్స్ క్లబ్ మార్కాపురం ఆధ్వర్యంలో నేడు గురువారం తర్లుపాడు రోడ్డులోని కేఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఒంగోలుకు చెందిన ఆస్టర్ హాస్పిటల్స్ నిపుణులు పాల్గొని న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్ విభాగాల్లో వైద్య సేవలు అందించనున్నారు. ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్, వైద్యుల సలహాలు, అవసరమైన మందులు అందించనున్నారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అధ్యక్షుడు కె.వి. జగన్ బాబు (98850 21929), జోన్–2 చైర్మన్ టి.వి. రామకృష్ణారావు (85008 51064), కార్యదర్శి బి.వి. రంగయ్య (94400 12125)