సామూహిక పారాయణం
Shiva Kumar
Prakasam Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,దోర్నాల: శ్రావణమాస శుభసందర్భంగా దోర్నాలలోని ప్రేమ సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత్ర సామూహిక పారాయణం నిర్వహించనున్నారు.శ్రావణ మాసంలో శిరిడీలో జరిగే సప్తాహ పారాయణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఏడు రోజులు శిరిడీ వెళ్లడం సాధ్యం కానందున ప్రేమ సాయి మందిరంలో సామూహికంగా పారాయణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు మొదటి రోజు పారాయణం ప్రారంభమవుతుంది. మానసిక శాంతి, ఆరోగ్యం, సంతాన సమస్యలు, ప్రతికూల పరిస్థితుల నివారణ, గ్రహస్థితి అనుకూలతతో పాటు అన్ని సమస్యలకు సచ్చరిత్ర పారాయణం బాబావారు సూచించిన ఆధ్యాత్మిక మార్గమని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తులందరూ పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.