శ్రీకాళహస్తి కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన న్యాయవాదులు
M Munirathnam
Srikalahasthi Reporter
◉
31 Views
గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా జిల్లా కోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి కోర్టు ఎదుట మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. “చెట్లను కాపాడుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గుమ్మల రాజేశ్వరరావు, గరికపాటి రమేష్‌బాబు, మల్లికార్జునయ్య, ముని సుబ్రహ్మణ్యం, అరుణ్‌తో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.