స్థానిక వార్తలు

ట్రాఫిక్ నియంత్రణలో ప్రతిభ.. వెంకటేష్‌కు ఎమ్మెల్యే, ఆర్డీవో ప్రశంసలు

Reporter
M Munirathnam Srikalahasthi Reporter
3 months ago
◉ 22 Views
News Image

గాయత్రి న్యూస్ ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే నాలుగు మాడవీధుల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి అభినందించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేష్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. ఆలయ దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలతో పాటు స్థానికుల రాకపోకల కారణంగా పట్టణంలో తరచూ ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ విధులు నిర్వర్తించిన వెంకటేష్ సేవలను అధికారులు ప్రశంసించారు.

ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్
రామోజీ ఎక్సలెన్స్ అవార్డు
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు.
ఏపీ సీఎం చంద్రబాబు భద్రతకు 6 కొత్త ఫోర్స్ వాహనాలు
21 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చల్లా గ్రీష్మ సంజన మేయర్ అభ్యర్థిగా తొలి నామినేషన్
రేజింతల్ సిద్ధి వినాయక ఆలయంలో కార్తీక మాస పూజలు
శివపూర మల్లికార్జునను రాష్ట్ర లేబర్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అభినందించిన ఈటల రాజేందర్
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ విధానంపై కంపెనీల ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ఏపీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం