శ్రావణం.. శుభకరం.. ఇంటింటా ప్రత్యేక పూజలు
Puthala Naveen
Mandal Reporter
◉
11 Views
గాయత్రి న్యూస్ ,భూపాలపల్లి: శ్రావణమాసంతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ఇంటింటా ప్రత్యేక పూజలతోపాటు ఉపవాస దీక్షలు చేపడతారు. మహిళలు మంగళవారాల్లో గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీ పూజలు చేస్తారు. ఈ నెల 17న నాగుల పంచమి, 18న మంగళగౌరీ వ్రతం జరుపుకోనుండగా, 28న అక్కాచెల్లెళ్లు అన్నదమ్ముల క్షేమాన్ని కోరుతూ రక్షాబంధన్ కడతారు. సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 11న పొలాల అమావాస్యతో శ్రావణమాసం ముగియనుంది.