జాతీయజెండాను ప్రజాప్రతినిధి ఎగురవేయవచ్చు
Prabhakar
Ealuru Incharge
◉
51 Views
గాయత్రి న్యూస్ ,జంగారెడ్డిగూడెం: కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూపొందించిన(మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్) ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం జాతీయజెండా కొలత3:2,ఎక్కడ,ఎలా ప్రదర్శించాలో చెప్పింది.2019లో ఏపి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా జెండాఎగురవేసే సమయాన్ని మాత్రమే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ కార్యాలయాల్లో"అధికారి మాత్రమే జెండా ఎగురవేయాలి”అనే నిబంధనలేదని తెలిపింది.ఎం.హెచ్.ఏ.జారీచేసిన స్వాతంత్రదినోత్సవ కార్యక్రమ మార్గదర్శకాల్లో గ్రామ,మండలస్థాయిలో సంబంధితశాఖకు సంబంధించి గ్రామపెద్ద,సర్పంచ్, ఎంపిటిసి,జడ్పీటీసీలు కూడా జెండా ఎగురవేయవచ్చని పేర్కొంది.